YSRCP MLA Ambati Rambabu Slams Pawan Kalyan Over Janasena Alliance With BJP Party.
#ambatirambabu
#pawankalyan
#janasenabjp
#ysjagan
#ysrcp
#apformers
#apcapital
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని వ్యక్తి అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. బీజేపీ, జనసేన పొత్తుపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. గత ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపలేదని గుర్తుచేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఒక్కొక్క లైబ్రరీలో కూర్చొని పుస్తకం చదువుతూ.. ఒక్కొరకంగా ప్రభావితం అవుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదుతామంటే తమకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.