Andhra's ministers, mlas and other public representatives busy with openings and other programmes during lock down time draws criticism from all corners. some of them have opened quarantine centres and others participated local programmes also.
#aplockdown
#APMinistersOpenings
#ysrcpmasks
#apcmjagan
#quarantinecentres
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ ఎక్కువవుతున్న సూచనలు కనిపిస్తున్నా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇళ్లలోనే ఉంటూ జనానికి ఆదర్శంగా ఉండాల్సిన తరుణంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు చివరికి ప్రభుత్వానికే చెడ్డపేరు తెచ్చేలా కనిపిస్తున్నాయి. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ , చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ, గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ పలుచోట్ల ప్రారంభోత్సవాలు చేస్తూ కనిపించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ కావడంతో వీటిపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు