Sanjay Manjrekar requests BCCI to take him back as commentator in IPL
#IPL2020
#SouravGanguly
#SanjayManjrekar
#Bcci
#RavindraJadeja
#HarshaBhogle
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఎట్టకేలకి వెనక్కి తగ్గాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020కి తనను వ్యాఖ్యాతగా తీసుకోవాలని కోరుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి మంజ్రేకర్ ఈమెయిల్ పంపించారని సమాచారం తెలిసింది. టీవీ వ్యాఖ్యాతల నిబంధనావళి ప్రకారమే నడుచుకుంటానని, తనకు మరో అవకాశం ఇవ్వాలని మంజ్రేకర్ విజ్ఞప్తి చేశారట. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.