Andhrapradesh : Jagananna Illa Pattalu’ will strengthen State economy: CM Jagan Mohan Reddy
#Andhrapradesh
#Ysjagan
#Allanani
#YSRJaganannaIllaPattalu
క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏకంగా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కోటి 24 లక్షల మందికి మేలు చేకూరే ఈ కార్యక్రమం వల్ల లక్షలాది మంది అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతున్నానని చెప్పారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్‌లో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.