Covid-19 Vaccination Drive in Telangana: From March second week common public in Telangana Will get Covid Vaccine
#Covid19Vaccination
#Covid19VaccinationDriveinTelangana
#commonpublicCovidVaccine
#Telangana
#TRS
#CMKCR
#Covid19VaccinationDrive
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం శనివారం (ఫిబ్రవరి 13) నుంచి ప్రారంభం అయింది. కాగా జనవరి 16న టీకా డ్రైవ్ ప్రారంభమవగా, ఆ రోజున 3,962 మంది ప్రభుత్వ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. వారంతా టీకా తీసుకొని నేటితో 28 రోజులు అవుతోంది. అందుకే రెండో డోసును అందించే ప్రక్రియను వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది. అయితే మరోవైపు కరోనా వ్యాక్సిన్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై సాధారణ ప్రజానీకంలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మార్చి నుంచి అందరికీ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.