Rajasthan Royals Pacer Chetan Sakariya's Father lost life with COVID-19
#IPL2021
#ChetanSakariya
#ChetanSakariyaFatherCOVID19
#RajasthanRoyals
#RRpacer
#ChetanSakariyaonfatherCovid19treatment
#IPLMoney
#COVID19Vaccination
తన అరంగేట్ర ఐపీఎల్ సీజన్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చి అందరి దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వైరస్ బారిన పడిన అతని తండ్రి కంజి భాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రెండు రోజుల క్రితమే ఐపీఎల్ సంపాదనతో తన తండ్రికి మెరుగైన చికిత్స అందిస్తున్నానని, ఐపీఎల్ 2021 సీజన్ తన జీవితాన్ని మార్చిందని చేతన్ సకారియా తెలిపిన విషయం తెలిసిందే. ఇంతలోనే అతని తండ్రి మృతి చెందారన్న వార్త క్రికెట్ అభిమానులకు విషాదాన్ని మిగిల్చింది.