Andhrapradesh: Curfew restrictions eased in Andhrapradesh today as per the state govt decision. All apsrtc services and advance reservation system will be resumed from today, banks and govt offices to be worked normal
#APCurfewRestrictions
#Lockdown
#Andhrapradesh
#Interstatebusservices
#APSRTCBuses
#Banks
#AptoTS
#AndhrapradeshTotelangana
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నేటి నుంచి పగటి పూట కర్ఫ్యూ తొలగిపోనుంది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకుంది. అలాగే కర్ఫ్యూ సడలింపుతో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడవబోతున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా పనిచేయనున్నాయి. ఒక్క తూర్పుగోదావరి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో జనజీవనం సాధారణ స్ధితికి చేరబోతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఏపీలో జరిగే మార్పులేంటో ఓసారి చూద్దాం...ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి పగటి పూట కర్ఫ్యూని ఎత్తేశారు. దీంతో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూ ఉండదు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో ఇక పగటి పూట కర్ఫ్యూ ఉండదు. ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చే ఈ సడలింపులు ఈ నెల 30 వరకూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకూ పరిస్ధితుల్లో ఎలాంటి మార్పూ లేకపోతే ఈ సడలింపులు కొనసాగుతాయి. లేకుంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ అమల్లోకి రానుంది.