WTC Final: ICC did not get the rules right, says VVS Laxman after rain plays spoilsport on Day 4 again
#ViratKohli
#Teamindia
#WTCFinal
#KaneWilliamson
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరుగుతున్న ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితులపై క్రికెట్ మాజీలతో పాటు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఇప్పటికే తమ అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో తాజాగా భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ చేరారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనలు సరిగ్గా లేవని లక్ష్మణ్ అన్నారు. ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతున్న తీరు అభిమానులను నిరాశ పరిచిందన్నారు. ఛాంపియన్‌షిప్ అన్నప్పుడు విజేత ఎవరో తేలాలని లక్ష్మణ్ పేర్కొన్నారు.