Neeraj Chopra Wins : డైమండ్ లీగ్ లో స్వర్ణం గెలుచుకున్న నీరజ్ చోప్రా | ABP Desam

Abp Desam 2022-08-27

Views 12

ఇండియన్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. లుసానే డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో అగ్రస్థానంతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ పోటీ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేశాడు. ఈ ఘనతతో.. జ్యూరిచ్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. మెుత్తంగా.. డైమండ్‌ లీగ్‌ మీట్‌లో విజేతగా నిలిచిన తొలి భారత అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు.. నీరజ్ చోప్రా.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS