It is being discussed that Pawan Kalyans vehicle Varahi has a great power behind its name and Pawan will win the next election | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళాలని భావించిన జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఎలక్షన్ బ్యాటిల్ కోసం వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా పర్యటించనున్న ఈ ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక వారాహి ట్రయల్ రన్ ను హైదరాబాద్లో నిర్వహించిన పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్రంలోని తనకిష్టమైన ఆలయంలో వారాహికి పూజలు చేయించి ఏపీలో ఎన్నికల కురుక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు.
#Janasena
#PavanKalyan
#VarahiVehicle
#PowerStar
#AndhraPradesh
#CMjagan