బిజెపి చీఫ్ బండి సంజయ్ పై మంత్రి కెటిఆర్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో జరిగిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ పై విరుడుకుపడ్డారు. కెటిఆర్ కు డ్రగ్స్ అలవాటు ఉందని పరీక్షలు చేయుంచుకోవాలని బండి సంజయ్ గతంలోవిసిరిన సవా ను జర్నలిస్టులు ప్రస్తావించగా మంత్రి ఫ్రస్టేషన్ తో సమాధానం ఇచ్చారు. ఏంద్యయా అంటు ఆ అయ్యా ఈ ఆయ్యా అంటూ విలేఖర్లను సంభోదిస్తు తాను వైద్య పరీక్షలు చేయుంచుకుంటానని క్లీన్ చిట్ తో వస్తానని అయితే బండి సంజయ్ తన చెప్పుతో తాను కరీంనగర్ కమాన్ వద్ద కొట్టుకుంటాడా అంటూ ఎదురు సవాల్ చేశారు. అభివృద్ది చేత కాక చెత్త వాగుడువాగుతున్నారంటూ మండిపడ్డారు.