I have said repeatedly that the charges are false, fabricated and baseless. I have nothing to say; the submissions in court will be self evident. I am not a decision maker. I follow the proceedings. They are all public proceedings," Mallya told
తాను ఏ తప్పు చేయలేదని, తాను నిర్ధోషినని బ్యాంకులకు వేల కోట్లు రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా అన్నారు
విచారణలో భాగంగా ఇక్కడి వెస్ట్‌మినిస్టర్ కోర్టుకు చేరుకున్న మాల్యా మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, తాను నిర్దోషినని అన్నారు. తానేంటో కోర్టే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. తన అనుచరులతో కలిసి నాలుగు పెద్ద పెద్ద బాక్సుల్లో సాక్ష్యాలను కోర్టు ఆవరణకు తీసుకొచ్చారు. సోమవారం ప్రారంభమైన విచారణ డిసెంబర్ 14 వరకు కొనసాగనుంది. అనంతరం తీర్పు వెలువడనుంది.
విచారణలో భాగంగా భారత్ నుంచి సీబీఐ, ఈడీ బృందం కూడా లండన్ చేరుకుంది. భారత్ బ్యాంకులకు రూ.9వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి విజయ్‌మాల్యా లండన్ పారిపోయినన సంగతి తెలిసిందే. స్కాట్‌లాండ్ పోలీసులు గతంలోఅతడిని అరెస్ట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే భారత్, యూకే మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం మాల్యాను వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
మాల్యా గొప్ప ధనవంతుడని, ఎంతో గొప్పవాడని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మాల్యాను తమ దేశం నుంచి తీసుకెళ్లవద్దని ముక్తకంఠంతో కోరుతున్నారు. మాల్యా తమ గ్రామానికి గొప్ప ఆస్తి లాంటివాడని పేర్కొంటున్న ఆ గ్రామవాసులు, మాల్యా ప్రస్తుతం సమస్యల్లో ఉన్నారని, ధనవంతులకు ఇలాంటి సమస్యలు సాధారణమని వారు చెప్పుకు రావడం గమనార్హం.