It's an interesting rumour over Allu Arjun's latest film 'Naa Peru Surya', somebody saying that there are similarities between this film and Rajesekhar's old one.
సినిమాపై బజ్ క్రియేట్ అవడం వేరు.. ఈ సినిమాతో పక్కా రికార్డులు బద్దలు అనిపించుకోవడం వేరు. 'నా పేరు సూర్య' టీజర్‌తో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు అల్లు అర్జున్.
రికార్డుల సంగతేమో కానీ.. ఈ సినిమాతో టాలీవుడ్‌కు సరికొత్త కథను, హీరో క్యారెక్టరేషన్‌ను పరిచయం చేస్తున్నట్లు ఫస్ట్ ఇంపాక్ట్ ద్వారా అర్థమవుతోంది. అయితే ఇలాంటి కథతో.. ఇదే తరహా పాత్రతో గతంలోనూ ఓ సినిమా రావడం గమనార్హం. ఇంతకీ దీనికి.. దానికి ఏంటా పోలిక..
ఓ 20ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పట్లో రాజశేఖర్ హీరోగా నటించిన 'ఆగ్రహం' సినిమా వచ్చింది. ఆ సినిమాలో రాజశేఖర్ పాత్ర సరిగ్గా ఇప్పుడు వచ్చిన 'నా పేరు సూర్య'లో అల్లు అర్జున్ పాత్ర తరహాలో ఉంటుంది. యాంగ్రీ ఆర్మీ మ్యాన్ గా.. నిండా దేశభక్తి కలిగి ఉన్న వ్యక్తిగా రాజశేఖర్ ఆ సినిమాలో కనిపించారు.