India vs South Africa: Virat Kohli loves Pandya's Flying One handed Catch

Oneindia Telugu 2018-02-15

Views 1K

Former South African captain Shaun Pollock said that Virat Kohli sees a bit of himself in Hardik Pandya and predicted a long run for the all-rounder in the Indian team.

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఫీల్డింగ్ చేసి రాణించిన పాండ్యాను కోహ్లీ తెగమెచ్చుకున్నాడట. అంతే కాదు, వ్యక్తిగతంగా కూడా పాండ్యా అంటే కోహ్లీకి ఇష్టమట.
విరాట్‌ కోహ్లికి నచ్చేలా హార్ధిక్‌ పాండ్య ఉంటాడని.. కాబట్టి అతడి భవిష్యత్తుకు ఢోకా లేదంటున్నాడు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ షాన్‌ పొలాక్‌. కోహ్లి నాయకత్వంలో పాండ్యకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలే వస్తాయనేది పొలాక్‌ అభిప్రాయం. అందుకు కారణం కూడా చెబుతున్నాడు.
మైదానంలో కోహ్లిలానే పాండ్య కూడా ఉంటాడు. కోహ్లికి ఆ తరహా దృక్పథం నచ్చుతుంది. తన స్థానం సుస్థిరం చేసుకునేందుకు అవసరమైన అవకాశాలైతే విరాట్‌ కెప్టెన్సీలో పాండ్యాకు లభిస్తాయి'' అని పొలాక్‌ చెప్పాడు. చాలా మంది ఆటగాళ్లకు సామర్థ్యముంటుంది గానీ.. దాన్ని తర్వాతి స్థాయికి ఎలా తీసుకువెళ్లాలో తెలియదని.. ఈ విషయంలో పాండ్య జాగ్రత్త వహించాలని పొలాక్‌ సూచించాడు.
''ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో రాణించాలంటే ఏం చేయాలో పాండ్య తెలుసుకోవాలి. దూకుడును మిళితం చేసి ఆడాలనుకుంటాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో కొంత సమయం నిలదొక్కుకోగలిగితే కచ్చితంగా పాండ్య కుదురుకుంటాడు'' అని పొలాక్‌ అన్నాడు.
ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన ఐదో వన్డే మంగళవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 42వ ఓవర్లో కుల్దీప్‌ వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న సఫారీ బ్యాట్స్‌మన్ తాబ్రిజ్ షంసీ లాంగ్‌ ఆన్‌ మీదుగా గాల్లోకి లేపాడు.
బంతిని ఒడిసిపట్టుకునేందుకు పాండ్యా-ధావన్‌లు పరిగెత్తారు. బంతిని అందుకునే క్రమంలో వీరిద్దరూ ఒకరినిమరొకరు ఢీ కొనబోయారు. అయితే చివరకు ధావన్ వెనక్కి తగ్గి ఆ అవకాశాన్ని పాండ్యాకు ఇచ్చాడు. దీంతో పాండ్యా ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టాడు. దీంతో భారత ఆటగాళ్లు ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు.

Share This Video


Download

  
Report form