Shruthi Haasan Marriage News : Real or Fake ?

Filmibeat Telugu 2018-02-21

Views 1

Shruti Haasan to Get Married this in December. Shruti Haasan marriage news goes viral in social media

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న శృతి హాసన్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. శృతి హాసన్ చేతిలో ప్రస్తుతం అవకాశాలు అంతగా లేవు. దీనికి కారణం ఆమె ప్రేమ వ్యావహారమే అని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. శృతి హాసన్ తన లండన్ బాయ్ ఫ్రెండ్ తో గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ పెళ్లి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో శృతి పెళ్లి కూతురు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శృతి హాసన్ తన ప్రియుడితో పబ్లిక్ గానే తిరుగుతున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. పలు సందర్భాల్లో ప్రేమ కాదు, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని బుకాయించింది.
తన ప్రియుడు మైకేల్ కొర్సలే ని తన తండ్రి కమల్ హాసన్ కు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తల్లి వద్ద కూడా ప్రేమకు అంగీకారం చెప్పించుకుంది. అప్పటినుంచి శృతి హాసన్ పెళ్లిపై వార్తలు వస్తూనే ఉన్నాయి.
శృతి హాసన్ సౌత్ లో కొద్దిరోజుల క్రితం వరకు క్రేజీ హీరోయిన్ గా కొనసాగేది. టాలీవుడ్ లో ముఖ్యంగా శృతి హాసన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగేది. ప్రియుడివైపు ధ్యాస పెరగడం వలన శృతి హాసన్ కెరీర్ నాశనం చేసుకుందని వార్తలు , కామెంట్లు పడుతున్నాయి.
శృతి హాసన్ ప్రస్తుతం తన ప్రియుడితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS