Sridevi's Last Rites : Everything You Wanted To Know

Oneindia Telugu 2018-02-26

Views 3.8K

Dubai Police release the forensic report on Sridevi's lost life. It’s an end of an era for Indian cinema as it lost one of its legendary actors – Sridevi. Following a massive cardiac arrest. Reports suggest that, Chiranjeevi, Nagarjuna and Venkatesh are expected to attend the last rites . Also, Bharathiraaja who directed her in many films, Prakash Raj, K Raghavendra Rao are expected to be part of the last rites.

నటి శ్రీదేవి మృతిపై దుబాయ్ పోలీసులు సోమవారం మాట్లాడారు. ఆమె మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని పోలీసులు వెల్లడించారు. ఆమె గుండెపోటుతో మృతి చెందారని చెప్పారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. దుబాయ్ పోలీసులకు శ్రీదేవి ఫోరెన్సిక్ రిపోర్ట్ అందింది. శ్రీదేవి మరణ ధ్రవీకరణ పత్రం మధ్యాహ్నం సమయంలో జారీ అయింది. దీంతో ఆమె భౌతికకాయాన్ని భారత్ తరలించేందుకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
శ్రీదేవి మృతదేహానికి రెండోసారి శవపరీక్ష అవసరం లేదని ఫోరెన్సిక్ వైద్యులు వెల్లడించారు. శ్రీదేవికి రేపు అంత్యక్రియ నిర్వహించనున్నారు. ఆమెకు చెందిన భాగ్య బంగాల్లో అభిమానుల కోసం పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. రాత్రి పది గంటల సమయంలో మృతదేహం ముంబైకి చేరుకోనుంది. ముంబైలోని ఆమె ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు.
గ్లామర్ క్వీన్ శ్రీదేవి మృతివార్తతో తల్లడిల్లిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలోనూ, ఇతర మార్గాలలో తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక శ్రీదేవిని కడసారి దర్శించుకొనేందుకు అభిమానులు ఇప్పటికే ఆమె నివాసం వద్దకు భారీ సంఖ్యలో గుమిగూడారు. పలువురు దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులు ముంబైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు
శ్రీదేవి తో దాదాపు 20 చిత్రాల్లో కలిసి నటించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పటికే ముంబై చేరుకొన్నారు
తెలుగులో శ్రీదేవితో దాదాపు 24 చిత్రాల్లో కలిసి పనిచేసిన దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ముంబైకి వెళ్తున్నట్టు సమాచారం

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS