A statement from Sridevi's family said the last rites would take place from 3:30 in the afternoon at the Pawan Hans crematorium in Vile Parle.
శ్రీదేవి భౌతికకాయం స్వగృహానికి చేరుకోవడంతో వేలాది మంది అభిమానులు, వందలాది మంది నటీనటులు ముంబైకి చేరుకుంటున్నారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు ముంబైకి వస్తున్నారు. శ్రీదేవి స్వగృహంలో పార్ధీవదేహన్ని ఉంచారు. శ్రీదేవి ఇంటి ప్రాంగణమంతా జనాలతో కిక్కిరిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
శ్రీదేవికి తెలుపు రంగు అంటే ఇష్టం. దీంతో శ్రీదేవి నివాసం ఉన్న ఇంటి నుండి ఆమె పార్థీవ దేహన్ని స్పోర్ట్స్ క్లబ్‌కు తీసుకెళ్ళేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని తెలుపు రంగుతో అలంకరించారు.
బుదవారం మధ్యాహ్నం 2గంటలకు శ్రీదేవి అంతిమయాత్ర జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సందర్శనార్థం సెలబ్రేషన్ క్లబ్‌లో శ్రీదేవి పార్థివదేహం ఉంచనున్నారు.మధ్యాహ్నం 3.30 గంటలకు విలేపార్లే హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీదేవి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కుటుంబసభ్యులు ప్రకటించారు. కడసారి చూసేందుకు అభిమానులకు ఏర్పాట్లు చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు. అతిలోక సుందరి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు, నటీనటులు ముంబైకి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి తెలుగు సినీ ప్రముఖులు కూడా ముంబైకి బయలుదేరారు.