2019 Elections : టీడీపీ కాంగ్రెస్ తో, పవన్ లెఫ్ట్ పార్టీలతో ?

Oneindia Telugu 2018-03-29

Views 344

In 2019 Elections Congress may alliance with TDP , Pawan Kalyan janasena may go with left parties

వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. ఏ పార్టీ ఏ పార్టీతో కలుస్తుందో, ఎవరు ఒంటరిగా పోటీ చేస్తారో తెలియకుండా ఉందని అంటున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి
మొన్నటి వరకు టీడీపీ-బీజేపీ దోస్తీ. గత ఏడాది కాలంగా వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రహస్య భేటీలు జరుగుతోందనే ప్రచారం కూడా ఉంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో దోస్తీ కడుతుంటే.. బీజేపీతో ఒప్పంతం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది.
ఏపీలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది. ఇది అనూహ్య పరిణామానికి దారి తీసే అవకాశం లేకపోయినప్పటికీ చర్చకు మాత్రం అవకాశమిస్తోంది. అదే టీడీపీ, కాంగ్రెస్ బంధం. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టుకు వచ్చింది. కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎంపీలు సోనియా గాంధీని కలవడం మొదలు, ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైసీపీ ఎంపీలకు మద్దతుగా కాంగ్రెస్ నిలవడం, అది కూడా అవిశ్వాసం నోటీసు ఇవ్వడం, చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ మినహా ప్రధాన పార్టీలు పెద్దగా పాల్గొనకపోవడం చర్చకు తావిస్తోంది.
మరోవైపు, జనసేన, వైసీపీ, బీజేపీల పైన కూడా ఆసక్తికర ప్రచారం సాగుతోంది. తాను వామపక్షాలతో కలిసి నడుస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ, ఆ నేతలతో భేటీ అవుతున్నప్పటికీ వెనుక బీజేపీ ఉందని టీడీపీ ఆరోపణలు చేయడం గమనార్హం. అంటే టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై ప్రచారం ఎంత నిజమో.. బీజేపీ-జనసేన రహస్య ఒప్పందం అంతే నిజమనే వారు లేకపోలేదు. ఎందుకంటే బీజేపీకి వామపక్షాలకు బద్ధ రాజకీయవైరం ఉంది. బీజేపీకి పవన్ దగ్గర ఉన్నాడని తెలిస్తే వారు తమ దరి చేయనీయరని గుర్తు చేస్తున్నారు.
పరిస్థితులు చూస్తుంటే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా, జనసేన-వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయని భావిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ, వైసీపీ కలిసి పోటీ చేయకున్నా లోపాయకారి ఒప్పందం ఉండే అవకాశముందని అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS