Romantic Criminals is a Telugu movie starring Manoj Nandam,Avanthika,Monika,Divya Vijju and K Vinay in prominent roles. It is a drama directed by P Sunil Kumar Reddy.
#Romanticcriminals
#Avanthika
#manojnandam
#VinayMahadev
#Monika
#saigayatri
#divyaswapna
#sunilkumarreddy
#tollywood
యువతకు సందేశాన్నిచ్చే కథా కథనాలతో దర్శకుడు సునీల్‌రెడ్డి రూపొందించిన తాజా చిత్రం రొమాంటిక్ క్రిమినల్స్. ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం గురించి నాయికలు అవంతిక, వౌనిక మీడియాతో మాట్లాడారు. సినిమాకు ప్రేక్షకాదరణ దక్కడం హ్యాపీగా ఉందన్నారు. అవంతిక మాట్లాడుతూ గతంలో మూడు చిత్రాలు చేశాను. ఇది నాల్గవ సినిమా. మత్తు పదార్థాలకు అలవాటుపడిన ఏంజెల్ అనే యువతిగా కనిపిస్తా. తల్లిదండ్రుల పెంపకం సరిగా లేక, పిల్లల పట్ల శ్రద్ధచూపకపోతే ఆ పిల్లలు ఎలా తయారవుతారు అనేది నా పాత్ర ద్వారా దర్శకుడు చూపించాడు. ఇలాంటి పాత్రలు దొరకడం అరుదు.ఈ సినిమాలో నటించటం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. వౌనిక మాట్లాడుతూ ‘విశాఖ అందాల పోటీల్లో పాల్గొన్నపుడు తనను చూసిన దర్శకుడు ఓ పాత్రకు ఎంపిక చేసుకున్నారు. దర్శకుడు చెప్పిన కథ విన్న తరువాత వెంటనే అంగీకరించాను. నీరజ అనే విద్యార్థినిగా సినిమాలో కనిపిస్తా. రొమాంటిక్ క్రిమినల్ మంచి సినిమా మాత్రమే కాదు, సందేశాత్మకం కూడా. అందరూ చూడాలి’ అని కోరారు.