Inzamam-ul-Haq Seeks India-Pak Bilateral Series For "Betterment" Of Cricket
#Teamindia
#Indvspak
#Inzamamulhaq
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య తిరిగి క్రికెట్ కొనసాగాలని, ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కన్నా.. దాయాదుల పోరే ఎక్కువగా చూస్తారని, ఆ క్షణాలను అభిమానులు పూర్తిగా ఆస్వాదిస్తారని చెప్పాడు. ఇరు జట్ల మధ్య ఆట బలోపేతానికి, ఆటగాళ్ల అభివృద్ధికి ఆసియా కప్‌తో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం ఎంతో ముఖ్యమని ఇంజమామ్ తెలిపాడు. భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గతకొంతకాలంగా ఇరు దేశాలు మ్యాచులు ఆడడం లేదు. ఐపీఎల్ టోర్నీలో కూడా పాక్ ఆటగాళ్లు ఆడడం లేదు.