Prime Minister Narendra Modi reached Papua New Guinea on May 21. PM Marape touched PM Modi’s feet and sought his blessings upon his arrival at the island nation.
జపాన్ పర్యటన ముగిసిన వెంటనే మోదీ అక్కడి నుంచి పపువా న్యూగినియాకు బయలుదేరి వెళ్లారు. ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్ మరాపె స్వయంగా ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి స్వాగతం పలికారు, రెడ్ కార్పెట్ పరిచారు. ఆ దేశ సైన్యం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు మోదీ. విమానం నుంచి కిందికి దిగిన వెంటనే జేమ్స్ మరాపె మోదీకి సాదర స్వాగతం పలికారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ వెంటనే మోదీకి పాద నమస్కారం చేశారు. కాళ్లు మొక్కి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.
#PMModi #JamesMarape #PapuaNewGuinea #PMModiblessings #japan #G7Summit
~ED.42~PR.41~