Pawan Kalyan Khammam tour : పవన్ కళ్యాణ్‌ పైకి చెప్పు, గందరగోళం : వీడియో

Oneindia Telugu 2018-01-24

Views 10

An unidentified guy thrown a chappal at Janasena Party president Pawan Kalyan's car in Khammam tour.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఖమ్మం పర్యటనలో ఓ చెప్పు కలకలం సృష్టించింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసరడంతో అది పవన్ కారు బ్యానెట్‌పై పడింది. ఓపెన్‌టాప్ కారులో అభిమానులకు అభివాదం చేసుకుంటూ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
ఆయన వాహనం తల్లాడ సెంటర్‌కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ఆ జన సమూహంలోంచి ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే అది కారు బ్యానెట్‌పై పడడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదేమీ లెక్కచేయకుండా పవన్ తన ర్యాలీని కొనసాగించారు.
ఈ ఘటన అనంతరం ఖమ్మంలో ఎంబీ గార్డెన్స్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పవన్ కార్యకర్తలు, నేతలనుద్దేశించి మాట్లాడారు. ‘నాపై దాడులు చేసినా ఎదురుదాడి చేయను. ప్రజల కోసం ఏమైనా భరిస్తా. మహనీయుల ఆశయాల కోసం బాధ్యతాయుత రాజకీయాలు చేయాలి' అని పవన్ చెప్పారు.
‘సమస్యలపై అధికారపక్షాలను నిలదీయడమంటే తిట్టడం కాదు.. నా జీవితం జనసేన కార్యకర్తలకు అంకితం. నేను పదవులు కాదు.. సామాజిక మార్పు కోరుకుంటున్నా. ప్రేమించేవాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వను' అని పవన్ పునరుద్ఘాటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS